గుంటూరు కారం: నెగెటివిటీ బ్యాచ్ కి సింహ స్వప్నం?

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాకి ఫ్యాన్స్,సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ కొన్ని పనికిమాలిన వెబ్ సైట్స్ ఇంకా పనికిమాలిన యూ ట్యూబర్ల నుంచి దారుణమైన నెగటివిటీ వచ్చింది.అయినా కానీ మహేష్ బాబు స్టామినా వల్ల ఈ సినిమా 250 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి నెగటివిటీ స్ప్రెడ్ చేసిన చెత్త వెబ్ సైట్లు చెత్త యూ ట్యూబర్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది. రీసెంట్ గా ఒక పనికిమాలిన వెబ్ సైట్ జర్నలిస్ట్ కి నిర్మాత నాగవంశీ గుంటూరు కారం రిజల్ట్ తో తాము హ్యాపీగా ఉన్నామని కౌంటర్ ఇచ్చి ఆ పనికిమాలిన జర్నలిస్ట్ కి గట్టి రాడ్డు దింపాడు.ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మూవీ చాలా మందికి కనెక్ట్ అవుతోంది. ఇతర భాషలలో కూడా మూవీని ఎంతగానో ఆశ్వాదిస్తున్నారు.


ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అయితే పాన్ ఇండియా ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. శ్రీలీల డాన్స్ టాలెంట్, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, డాన్స్ పైన ప్రసంసలు కురిపిస్తున్నారు.తాజాగా ఇండియన్ స్టార్ క్రికెటర్, స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్  ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాని తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. ఈ సినిమాలో సాంగ్స్ కి మహేష్ బాబు, శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేశారని అన్నాడు. మీరు చూడకపోతే యుట్యూబ్ లో గుంటూరు కారం సాంగ్స్  చూడండి. కచ్చితంగా నచ్చుతుంది అంటూ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కి అశ్విన్ సజస్ట్ చేశారు.గుంటూరు కారం మూవీ పై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ అభిమానులు వీడియోని X, పేస్ బుక్ లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.డిజాస్టర్ టాక్ తో ఇంత మంచి ఆదరణ వస్తూ ఉండటం నిజంగా విశేషమని చెప్పాలి. గుంటూరు కారం మూవీ చూడదగిన మూవీ అని కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేశారని సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: