అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పుష్ప 2 షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ  సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ హీరోతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు. నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ మరింత ఎక్కువైంది. పుష్ప సినిమాలోని సాంగ్స్ డైలాగ్స్ ప్రపంచమంతా ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. దీంతో పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఎగ్జాటింగ్ గా

ఎదురు చూస్తున్నారు ఫాన్స్. దీంతో ప్రస్తుతం పుష్పా 2 సినిమాకి సంబంధించిన షూటింగ్స్ సైతం శరవేగంగా జరుగుతోంది.  ఇటీవల రామోజీ ఫిలింసిటీ, అనంతరం వైజాగ్ పోర్ట్ లో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు నంద్యాల దగ్గర బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం, ఇక్కడ నంది ప్రత్యేకమైనది అని తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప బాగా డబ్బున్న వాడిగా ఎదుగుతాడని మొదటి పార్ట్ లో చూపించారు. రష్మికతో పెళ్లి కూడా అవుతుంది. సెకండ్ పార్ట్ లో రష్మిక యాగంటిలో ఉన్న

ఉమామహేశ్వర స్వామి వారికి బంగారు కిరీటం అందించే సీన్ షూట్ చేస్తున్నారట. ఆల్రెడీ నిన్న షూట్ జరగ్గా, ఇవాళ కూడా అక్కడే షూట్ జరగనుందని సమాచారం. అయితే ఈ సీన్ లో అల్లు అర్జున్ లేడని తెలుస్తుంది. రష్మిక వచ్చిందని తెలియడంతో షూటింగ్ వద్దకు యాగంటి జనాలు భారీగా వచ్చారు. ఇక పుష్ప 2 సినిమా నుంచి ఆల్రెడీ ఓ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. దీంతో బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి భాగం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసింది మరి పుష్ప 2  కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: