స్టేజ్ పైనే విజయ్ దేవరకొండ కి ముద్దులు పెట్టిన షాహిద్ కపూర్..!?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమాలపై తనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విషయాన్ని అందుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగ  ధర్షకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. దాంతో ఈ సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రిమేక్ కూడా చేయడం జరి గింది. అక్కడ కూడా ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టింది.

దాంతో బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ కి క్రేజ్ వచ్చింది. ఇక ఏ సినిమాలో షాహిద్ కపూర్ కియారా అద్వానీ  హీరో హీరోయిన్లుగా కనిపించారు. 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఏకంగా 250 కోట్ల వసూళ్లను సైతం రాబట్టింది. ఇక ఈ రెండు సినిమాలతో సందీప్ రెడ్డివంగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో కూడా చేరాడు.. తాజాగా ఈ ఇద్దరు హీరోలు ఒకే స్టేజ్ పై మెరిశారు.. మంగళవారం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఓ ఈవెంట్ నిర్వహించగా అన్ని

సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే స్టేజిపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.. షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. ఇతని వల్లే నాకు మంచి సినిమా ఆఫర్ వచ్చింది.. విజయ్ అర్జున్ రెడ్డి చేయకపోతే నా కబీర్ సింగ్ సినిమా లేదు అంటూ విజయ్ బుగ్గపై ముద్దు పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: