తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతున్న మలయాళ ఇండస్ట్రీ హిట్ మూవీ..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ లో చాలా సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలను అందుకుంటున్నాయి. అలా ఈ మధ్య కాలంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో మంజుమెల్ బాయ్స్ మూవీ ఒకటి. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మలయాళ భాషలో విడుదల అయింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్ ను జనాలు నుండి తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ను మార్చి 29 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మైత్రి సంస్థ వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ సినిమా తెలుగు వర్షన్ ను మార్చి 29 వ తేదీనే విడుదల చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: