ఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "కెప్టెన్ మిల్లర్"..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే సినిమా లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... అరుణ్ మాటేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఇక పోతే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి శివరాజ్ కుమార్ అలాగే తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి సందీప్ కిషన్ కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమా ఈ సంవత్సరం ప్రారంభంలో మొదట తమిళ్ లో విడుదల అయ్యి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు లో విడుదల చేశారు . ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు . ఇక ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే అలరించింది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది . తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జెమిని సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: