విక్రమ్ కె కుమార్ కు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్న నితిన్ !

Seetha Sailaja
నితిన్ కెరియర్ లో చెప్పుకోతగ్గ సినిమాలలో ‘ఇష్క్’ మూవీ ఒకటి. సుమారు 12 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ మూవీకి దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ సమర్థను గుర్తించిన నాగార్జున అక్కినేని కుటుంబం సభ్యులు అంతా చిరస్మరణీయంగా చెప్పుకునే ‘మనం’ సినిమాను తీసే అవకాశం అతడికి ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరావు నటించిన ‘మనం’ మూవీతో అక్కినేని కుటుంబానికి బాగా సన్నిహితంగా మారిపోయిన విక్రమ్ ఆతరువాత అక్కినేని అఖిల్ తో ‘హలో’ నాగచైతన్య తో ‘థాంక్యు’ మూవీలను తీసినప్పటికీ ఆ రెండు సినిమాలు విజయవంతం కాలేదు.

అయితే విక్రమ్ నాగచైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్ కు మంచి పేరు రావడంతో ఇప్పుడు వెబ్ సిరీస్ కు సీక్వెల్ తీసే పనిలో కె విక్రమ్ కుమార్ బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా నితిన్ విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘హనుమాన్’ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నిరంజన్ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నట్లు లీకులు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం విక్రమ్ కుమార్ ట్రాక్ రికార్డు అంతంత మాత్రంగా ఉంది. అతడు గతంలో నాని తో తీసిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ కూడ ఫెయిల్ అవ్వడంతో అతడి మార్కెట్ బాగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితులలో నితిన్ మళ్ళీ ఈ దర్శకుడితో ఒక సినిమాను చేయడం ఒక సాహసం అనుకోవాలి. ప్రస్తుతం నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో ‘తమ్ముడు’ మూవీ చేస్తున్నాడు.
పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా పవన్ కళ్యాణ్ అభిమానులతో ప్రేమతో పిలిపించుకునే నితిన్ గతంలో పవన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ టైటిల్ ను ఉపయోగించుకుంటున్నాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: