ఆంధ్రాలో మరో బిజినెస్ ని మొదలు పెట్టబోతున్న అల్లు అర్జున్..!!
అయితే ఈ మల్టీప్లెక్స్ లో సక్సెస్ గానే నడుస్తున్నాయి. త్వరలో రవితేజ కూడా ART అనే సినిమాస్ తో మల్టీప్లెక్స్ ను హైదరాబాదులో దిల్ సుఖ్ నగర్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.. అల్లు అర్జున్ మాత్రం తన AAA సినిమాస్ బిజినెస్ ని వైజాగ్ లో కూడా మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పుష్ప-2 సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ వైజాగ్ కి వెళ్ళాక అక్కడ అభిమానులు భారీగా రావడంతో వైజాగ్ లో కూడా ఇలాంటి ఒక మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ పెట్టాలని భారీగా ప్లాన్ వేస్తున్నారట.
త్వరలోనే వైజాగ్ లో ఇన్ ఆర్బిట్ మాల్ రాబోతోందని ఈ మాల్ లో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ తో కలిసి AAA సినిమా చూడడానికి చాలా రగ్జరీగా క్లాసిక్ లో కనిపించేలా ఉంటుందని భావించి ఆ రేంజ్ లో వైజాగ్ లో మల్టీప్లెక్స్ థియేటర్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం తెగ సంతోషిస్తున్నారు. వైజాగ్లో కూడా AAA అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అంటు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.