బోయపాటి యాక్షన్ ప్లాన్ లో బాలకృష్ణ !

Seetha Sailaja
షష్టిపూర్తి తరువాత బాలకృష్ణ వేగం మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి కెరియర్ హ్యాట్రిక్ సక్సస్ తో ముందుకుపోతూ ఉండటంతో బాలయ్య స్పీడ్ మరికొన్ని సంవత్సరాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్న బాలయ్య ఎన్నికల హడావిడి మొదలు కావడంతో తాత్కాలికంగా తన సినిమాల ప్లాన్ కు బ్రేక్ ఇచ్చాడు.

బాబి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న బాలయ్య తన లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఇస్తున్న లీకులు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. రాబోతున్న ‘ఉగాది’ పండుగ రోజున బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో రూపొందబోయే భారీ యాక్షన్ మూవీ ప్రారంభోత్సవం జరుగుతుందని లీకులు వస్తున్నాయి. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాక్.

గత కొంతకాలంగా బోయపాటి బాలయ్యతో తీయబోయే మూవీ ‘అఖండ 2’ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ అటు బాలయ్య నుండి కానీ ఇటు బోయపాటి నుండి కానీ బయటకు రాకపోవడంతో బోయపాటి బాలయ్య కోసం కొత్త కథను క్రియేత్ చేశాడా లేదంటే నందమూరి అభిమానులు కోరుకుంటున్న ‘అఖండ 2’ అయి ఉంటుందా అంటూ ఎవరి స్థాయిలో వారు గాసిప్పుల హడావిడి సోషల్ మీడియాలో చేస్తున్నారు.

వాస్తవానికి ఏప్రియల్ నెల అంతా బాలయ్య తన రాజకీయ కార్య కలాపాలలో బిజీగా ఉంటాడు. మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఒక చిన్నపాటి గ్యాప్ ను తీసుకుని బాబి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా వైపు బాలయ్య అడుగులు ఉంటాయి. ఈ మూవీ దసరా కు వస్తుంది అని అంటున్నారు. దీనితో ఈ మూవీ విడుదల అయ్యాక బోయపాటి బాలయ్యల మూవీ మొదలవుతుందా లేదంటే ఎన్నికల తరువాత కొన్ని రోజులు బాబీకి మరికొన్ని రోజులు బోయపాటికి తన డేట్స్ ఇచ్చి బాలయ్య ఈ రెండు సినిమాలను పరుగులు తీయిస్తాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: