సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్మ హీరోయిన్..!!

murali krishna
సంచలన డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది.వర్మ పోస్ట్ చేసినా.సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ  పోస్ట్  చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు.ఫైనల్‌గా ఆ అమ్మాయిది కేరళ అని ఆ యువతి పేరు శ్రీలక్ష‍్మి సతీశ్ అని వర్మ తెలిపారు. ఆమెతో 'శారీ' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. సినిమా కోసం ఆమె పేరును ఆరాధ్య దేవిగా మార్చడం జరిగింది. ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్‌ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్‌ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందించారు.ప్రస్తుతం ఆరాధ్య దేవితో తీస్తున్న 'శారీ' సినిమా ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి దాకా చీరలో పద్దతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన గ్లామర్‌తో కేకపుట్టించింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చీరలో యూత్‌ను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్‌తో అదిరిపోయే ఫోటోలను విడుదల చేసింది.ఈ ఫోటోలను వర్మ కూడా తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా షేర్‌ చేశారు.ఆరాధ్య ఫోటోలు చూసిన వారందరూ కూడా నోరెళ్లబెడుతున్నారు. అంతలా అవి వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వర్త్‌ వర్మ.. వర్త్‌ అంటూ షాక్ అవుతున్నారు. పద్ధతిగా చీరకట్టులో ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశావ్‌ వర్మ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: