"ఊరు పేరు భైరవకోన" మూవీకి 25 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఇకపోతే ఈ నటుడు తాజాగా ఊరి పేరు భైరవ కోన అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వ వహించగా ... వర్షా బోల్లమ్మ , కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాక్ ను తెచ్చుకుంది  దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ సినిమా 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.
 

ఈ 25 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 30 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం బాగానే అలరిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: