మరోసారి రిపీట్ అవుతున్న హిట్ కాంబినేషన్..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరియర్ లో 109వ సినిమా గా రాబోతోంది.  స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరికొత్తగా కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. కాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాను సితార 

ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దాంతోపాటు నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్ సైతం పార్ట్నర్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ  తన 110 సినిమా అని కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటి కీ బోయపాటి తో సినిమాకి నటసింహం నందమూరి బాలకృష్ణ  ఓకే చేసినట్లుగా సమాచారం.

 ప్రస్తుతం ఏపీ రాజకీయ హడావిడిలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ ఎక్కువగా బిజీ అవుతున్నారు. కాబట్టి స్టోరీల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునేంత సమయం కూడా దొరకడం లేదు. వీలైనంత తొందరగా బాబి సినిమాను తొందరగా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ .. బోయపాటి శ్రీను కాంబోలో తదుపరి సినిమాను చేయబోతున్నాడు.. బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఆ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నాడు..ఇప్పుడు ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. హీరోయిన్, ఇతర నటుల గురించి త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: