టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం
రాజా సాబ్ అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ కి టాలెంటెడ్
డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
నిధి అగర్వాల్ ,
మలవిక మోహన్ , రీద్ధి
కుమార్ లు ఈ సినిమాలో
ప్రభాస్ కి జోడిగా కనిపించబోతున్నారు. ఎస్ ఎస్
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత టీ జీ
విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా ప్రమోషన్ల జోరును పెంచుతూ వస్తున్నారు.
ఇప్పటికే ఈ
మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను , సాంగ్స్ ను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ ప్రీ రిలీజ్
ఈవెంట్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...
రాజా సాబ్
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్
ఈవెంట్ వేడుక ను
డిసెంబర్ 27 వ తేదీన
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , అందుకు అనుగుణంగా అన్ని పనులను పూర్తి చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ
మూవీ బృందం వారు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ
సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.