విడాకుల తరువాత మొదటిసారి భర్తపై అలాంటి కామెంట్స్ చేసిన ఐశ్వర్య..!.

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలీవుడ్ లోనే కాకుండా ధనుష్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ త్వరలో కుబేర  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

దీంతో వీరిద్దరి కాంబినేషన్లు వస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే ఐశ్వర్య  తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్  సక్సెస్ కు ధనుష్ కారణమని కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎదగడానికి కారణం ధనుష్ అని ఆమె తెలిపారు. అనిరుధ్ ను విదేశాలకు పంపించి చదివించాలని కుటుంబ సభ్యులు ఆలోచించగా ధనుష్ వాళ్ల మనస్సు మార్చి అనిరుధ్ కు కీబోర్డ్ కొని ఇచ్చాడని ఐశ్వర్య వెల్లడించారు. 3 సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయాలనే

 ఆలోచన ధనుష్ దని ఆమె పేర్కొన్నారు. అనిరుధ్ ఎదుగుదల చూస్తే అంతోషంగా ఉందని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.   విడాకుల తర్వాత ఐశ్వర్య ధనుష్ గురించి పాజిటివ్ గా ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది. ధనుష్ ఐశ్వర్య భవిష్యత్తులో మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధనుష్ కుబేర ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఈ మధ్య కాలంలో తన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తో క్రేజ్ పెంచుకుంటున్నారు. కుబేర సినిమా కథ గురించి వైరల్ అవుతున్న వార్తలు సైతం ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: