"విశ్వంభర" మూవీకి సంబంధించిన అదిరిపోయే విషయం..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వం లో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ లో చిరంజీవి కి జోడి గా త్రిష నటిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం విరి కాంబో లో స్టాలిన్ అనే మూవీ రూపొందింది.


ఆ సమయంలో స్టాలిన్ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకులు నుండి మంచి ప్రశంసలు దక్కాయి. చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబో లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఇప్పుడు ఎలా ఉంటుందో అని ఎంతో మంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చాలా మంది నటీ మణులు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ , మీనాక్షి చౌదరి కీలక పాత్రలల్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.


ఇక ఈ మూవీ లో ఈషా చావ్లా , సురభి , ఆశకా రంగనాథ్ లు చిరంజీవి కి చెల్లెళ్ల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమాలో చాలా మంది క్రేజ్ ఉన్న నటీ మణులు ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: