అమీర్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బాలీవుడ్ టాప్ హీరో అయిన అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమిర్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నారు. కాగా ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పుట్టినరోజు విషెస్ ను తెలుపుతున్నారు. అంతేకాదు ఆయనకి సంబంధించిన ఫోటోలను వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆయన కూతురు ఐరా ఖాన్ వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తన తదుపరి సినిమాల్లో బిజీ గా ఉన్నాడు ఆమీర్ ఖాన్.

లాల్ సింగ్ జద్దా డిజాస్టర్ తర్వాత తన సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు అమెరికన్ త్వరలోనే తన కొత్త సినిమాలపై కూడా అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ 59వ ఏట అడుగుపెడుతున్నాడు. ఈ వయసులోనూ చాలా ఫిట్‌గా ఉన్నాడు. రోజు ఉదయాన్నే జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తాడు. రంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. రంగానికి ఆయన చేసిన కృషికి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి రూ. 1862 కోట్లు.

 నటన, చిత్ర నిర్మాణం, బ్రాండ్ ప్రమోషన్ వివిధ పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తాడు. అమీర్ ఖాన్ లాస్ ఏంజెల్స్‌లో రూ.75 కోట్ల విలువైన మాన్షన్ హౌస్‌ని కలిగి ఉన్నాడు. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖులకు నివాసాలు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో అమీర్ ఖాన్ కు ఓ ఇల్లు ఉంది. 5000 చదరపు అడుగుల విస్తీర్ణం, రెండు అంతస్తులతో ఉంది. ఒక అంతస్తు ఆఫీస్ పనులకు వినియోగిస్తుండగా, మరో అంతస్తు వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నారు. దీని ధర దాదాపు 60 కోట్ల రూపాయలు. అలాగే అమీర్ ఖాన్ కి కార్లంటే పిచ్చి. అతనికి చాలా కార్లు ఉన్నాయి. వీటిలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. అతనికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉంది. దీని ధర దాదాపు 7-8 కోట్ల రూపాయలు. అమీర్ ఖాన్‌కు మెర్సిడెస్ బెంజ్ ఎస్600 కారు ఉంది. ఈ కారు ధర 10.50 కోట్లు. ఈ కారు చాలా విలాసవంతమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: