ఆ విషయంలో భార్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఈ స్థాయికి రావడానికి తన భార్య లక్ష్మి ప్రణతి కూడా చాలా సహాయపడింది అని జూనియర్ ఎన్టీఆర్ తన భార్యపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనితో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ భార్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 బాల్యంలో నేను హైపర్ మ్యాన్ అని పెళ్లి తర్వాత నేను హోమ్లీ మ్యాన్ గా మారానని ఎన్టీఆర్ కామెంట్లు చేయడం గమనార్హం. సినిమాల ఎంపికలో నాకు భార్య ఎన్నో సలహాలు ఇస్తుందని తారక్ వెల్లడించారు. ఈ తరం యువత ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో లక్ష్మీ ప్రణతి చెబుతుందని ఆయన అన్నారు. భార్య ఇచ్చిన సలహాల వల్ల నేను మంచి పాత్రలను ఎంచుకోవడంతో పాటు మరింత నటిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను నేనుగా ఉండేలా నా భార్య ప్రోత్సహిస్తుందని తారక్ చెప్పుకొచ్చారు.

నా భార్య మానసికంగా నాకంటే స్ట్రాంగ్ అని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. నా భార్య ఫిట్ నెస్ బడ్డీ అని నేను వ్యాయామం మానకుండా నా భార్య నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. నా భార్యకు కొత్త సినిమాలు అంటే ఎంతో ఇష్టమని తారక్ పేర్కొన్నారు. భార్య గురించి తారక్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల అర్ అర్ అర్  సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: