7 రోజుల్లో "ఆపరేషన్ వాలెంటైన్" కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వ సుందరి మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా ... రూహాని శర్మ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసు కుందాం.
ఈ మూవీ కి విడుదల అయిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 1.01 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 26 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ లో 1.24 కోట్ల కనెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.51 కోట్ల షేర్ ... 4.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 7 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 80 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తంగా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.31 కోట్ల షేర్ ... 6.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంలో ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది. మరి ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: