ఏంటీ.. సాయి పల్లవి ఆ బాడీ పార్ట్ పై టాటూ వేయించుకుందా?

praveen
హీరోయిన్ అంటే అందాల ఆరబోత చేయాలి. మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలి.. ఇక పాత్ర డిమాండ్ చేస్తే ఏకంగా ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే ఇన్నాళ్ళ వరకు హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అని అందరూ అనుకునేవారు. కానీ నటనలో టాలెంట్ ఉంటే సరిపోతుంది.. చిరునవ్వులో మ్యాజిక్  చాలు అని నిరూపించింది సాయి పల్లవి. ఫిదా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి  సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసేసింది.

 ఇప్పటివరకు సాయి పల్లవి ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమాలో కూడా అందరూ హీరోయిన్ల లాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని కనిపించలేదు. అంతేకాదు మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా నటించలేదు. ఇక ఇలాంటి ప్రత్యేకమైన శైలి అందరి హీరోయిన్లలో కెల్లా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది అని చెప్పాలి. ఒకరకంగా ఆమె లేడీస్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ను కూడా సంపాదించుకుంది అంటే ఈ ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో హుందాగా కనిపిస్తూ ఉంటుంది సాయి పల్లవి.

 అయితే సాధారణంగా ఎంతో మంది సినిమా హీరోయిన్లు ఇక తమకు ఇష్టం వచ్చిన దగ్గర టాటూలు వేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక సాయి పల్లవి మాత్రం ఇలాంటి టాటూ ట్రెండ్ కి దూరంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ సాయి పల్లవి కూడా టాటూ వేయించుకుందట. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా తన ఛాతిపై తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ బొమ్మను ట్యాటూగా వేయించుకుందట సాయి పల్లవి. అయితే అది హీరోయిన్గా మారిన తర్వాత కాదు. ఏకంగా కాలేజీ చదువుకున్న రోజుల్లోనే. కుటుంబ సభ్యులకు తెలియకుండా సీక్రెట్ గా ఛాతిపై టాటూ వేయించుకుందట. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత మొదట్లో పేరెంట్స్ అరిచిన తర్వాత లైట్ తీసుకున్నారట. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య సరసన థాండేల్ అనే మూవీలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: