బన్నీతో చేయడం ఇష్టం లేక.. జులాయిలో సోను సూద్ పాత్రను ఆ టాలీవుడ్ హీరో వదులుకున్నాడా?

praveen
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే  సినిమాలకి అటు టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఎందుకంటే ఇక ఆయన సినిమా చూస్తూ ఉంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆయన తన డైలాగులతోనే మాయ చేసేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో సూపర్ హిట్ కొట్టాడు మాటలు మాంత్రికుడు.  అయితే అల్లు అర్జున్ తో ఎన్నోసార్లు సినిమా తీసాడు అని చెప్పాలి. ఇక ఇలా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో అటు జులాయి మూవీ కూడా ఒకటి. ఇక ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచిపోతుంది. కానీ ఇప్పటికీ టీవీలో వచ్చిన ఎందుకో ప్రేక్షకులను మాత్రం టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ ఉంటుంది ఈ మూవీ.

 ఈ సినిమాలోని పాత్రలు డైలాగులు పాటలు అబ్బో చెప్పుకుంటూ పోతే వంక పెట్టడానికి ఒక్క కారణం కూడా దొరకదు జులాయి సినిమాకి. అయితే ఈ మూవీలో హీరోగా చేసిన అల్లు అర్జున్ పాత్ర ఎంతలా అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిందో ఇక విలన్ పాత్రలో నటించిన సోను సూద్ క్యారెక్టర్ కూడా అంతే ప్రేక్షకులకు ఎక్కేసింది అని చెప్పాలి. ఆ పాత్రను సోనుసూ తప్ప మరొకరు చేయలేరేమో అనేంతగా పాత్రకి ప్రాణం పోశాడు సోను సూద్. అయితే ఇక మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం ముందుగా ఈ పాత్ర కోసం మరొక నటుడిని అనుకున్నాడట. ఏకంగా అక్కినేని సుమంత్ ని ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యాడట.

 అయితే సుమంత్ మాత్రం ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడలేదట. విలన్ పాత్రలో నటించబోను అంటూ తేల్చి చెప్పేసాడట. పైగా అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో సినిమాలో విలన్ పాత్రలో నటిస్తే కెరియర్ మొత్తం పాడవుతుందని భయపడిపోయాడట సుమంత్. దీంతో పాత్రను రిజెక్ట్ చేసాడట. దీంతో అల్లు అర్జున్ అంటే ఇష్టం లేకనే సుమంత్ ఈ పాత్రను రిజెక్ట్ చేసాడని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక సుమంత్ మిస్ చేసుకున్న పాత్ర సోను సూద్ కి దక్కగా ఆ పాత్రకి ప్రాణం పోశాడు అతను. ఇక జులై సినిమా విడుదలైన తర్వాత సుమంత్ ఈ పాత్ర చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే సోను సూద్ నటన ను సుమంత్ మరిపించలేకపోయే వాడేమో అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: