బన్నీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హీరోయిన్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు.. అలా మొదట కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ ప్రియా భవాని శంకర్.. తన తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య నటించిన దూత అనే వెబ్ సిరీస్లో నటించింది.. ఇప్పుడు తాజాగా గోపీచంద్ తో కలిసి భీమా అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ చిత్రం శివరాత్రి కానుకగా రేపు విడుదల కాబోతోంది.

భీమా చిత్రాన్ని డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు ఫాంటసీ యాక్షన్ డ్రామగా వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్లో చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇటీవల ప్రియా భవాని శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది.. ఇటీవల యాంకర్ ఒక ప్రశ్న అడగగా.. మీరు ఏ నటుడితో సినిమాలలో లిప్ లాక్ చేయాలనుకుంటున్నారు అని అడగగా.. అందుకు తాను అల్లు అర్జున్ అభిమానిని ఆయన సినిమాలో రొమాన్స్ సీన్స్ ఉంటే కచ్చితంగా అల్లు అర్జున్కి లిప్ లాక్ చేయడానికి తాను సిద్ధమేనంటూ తెలియజేసింది.

ఈ విషయం విన్న అభిమానులు సైతం అల్లు అర్జున్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఈమెను పొగిడేస్తూ ఉన్నారు.. నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ తో తన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. రత్నం, ఇండియన్-2 వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నది. యముడు కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం టీవీ ప్రెసెంట్ గా తన కెరియర్ను కొనసాగిస్తోందట..సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అటు బుల్లితెర పైన ఇటు వెండితెర పైన అందరినీ మెస్మరైజ్ చేస్తోంది ప్రియా భవాని శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: