జనసేనలో చేరికపై హీరో విశ్వక్ సేన్ రియాక్షన్..!!

Divya
ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఎక్కువగా రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు.. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల విషయంలో మీడియా చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలను అడుగుతూ ఉన్నారు.. కొన్నిసార్లు ఇవే సమస్యగా మారుతున్నాయి.. తాజాగా యంగ్ హీరో అయినటువంటి విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా రిలీజ్ కి కొన్ని గంటల సమయం ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్నారు విశ్వక్ సేన్.. ఇలాంటి సమయంలోనే మీరు జనసేన లో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్న యాంకర్ వేసిందట.


అందుకు విశ్వక్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ ముంగుట ఈ ప్రశ్న అవునని చెప్పిన కాదని చెప్పిన తనని ట్రోల్ చేయడం గ్యారెంటీ అని.. ఈ ప్రశ్నకు తనదైన స్టైల్ లో సమాధానం తెలియజేస్తూ ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేశారు.. డోనాల్డ్ ట్రంప్ అంటే తనకు ఇష్టమని నేను పెద్ద అభిమానిని అంటూ కూడా విశ్వక్ తెలియజేశారు.. అమెరికా అధ్యక్షుడు ఎన్నికల సమయంలో తాను అక్కడికి వెళ్లి మరి ఓటు వేస్తానని కూడా తెలియజేశారు విశ్వక్..


అయితే విశ్వక్ సేన్ ను ఈ ప్రశ్న అడగడానికి ముఖ్య కారణం అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ప్రశ్న ఎదురయ్యిందని తెలుస్తోంది.. కానీ విశ్వక్ మాత్రం తెలివిగా సమాధానం ఇచ్చి మరి ఎలాంటి వివాదాలకు దారి ఇవ్వకుండా పెట్టారు.. విశ్వక్ నటించిన గామి సినిమా ట్రైలర్ కు చాలామంది డైరెక్టర్లు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు..ఈ సినిమా కోసం తన చాలా కష్టపడ్డానని.. అలాగే హీరోయిన్ చాందిని చౌదరి కూడా పలు సందర్భాలలో వెల్లడించింది..మరి శివరాత్రి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా అటు హీరో హీరోయిన్కు ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి మరి.. ముఖ్యంగా మూడు రోజులు సెలవు అవ్వడం చేత ఈ సినిమాకి బాగా కలిసొందని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: