బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు ..!?

Anilkumar
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్ తో తగ్గేదేలే అంటూ వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాడు పుష్ప. తన నటనతో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చాడు బన్నీ. దీంతో అల్లు అర్జున్ హవా మరింత పెరిగింది. పుష్ప 2 సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్ 1 వచ్చి మూడేళ్లు అవుతుంది. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ అవుతుందని గతంలోనే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. 

ఆల్రెడీ పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అంచనాలు మరిన్ని పెంచారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ డి బిగెస్ట్ హిట్ గా నిలిచిన ల్లో బన్నీ ఒకటి. 2008లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వి. వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ లో లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బన్నీ సినిమా లో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన

అమ్మడు గుర్తుందా.? ఆ చిన్నదాని పేరు గౌరి ముంజల్. మోడలింగ్ నుంచి సినిమా ల్లోకి వచ్చింది ఈ చిన్నది. అల్లు అర్జున్ తో నటించిన బన్నీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమా లు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.   ఈ క్రమంలో ఆమెకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటికి ఇప్పటికి గౌరి ముంజల్ చాల మారిపోయింది. బొద్దుగా తయారైన ఈ చిన్నది ఇప్పటికి అదే సోయగంతో కవ్విస్తుంది.  అయితే గౌరి ముంజల్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: