చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌: ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న - ప్ర‌జానేత‌గా గుర్తింపు ఎవ‌రు ఎలా..?

RAMAKRISHNA S.S.
- పేరుకు ప‌నికి తేడా లేని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌
- వలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో జ‌గ‌న్ స‌క్సెస్‌
- కార్పొరేట్ సీఈవోగా బాబు పాల‌న‌.. పేద‌ల ప‌క్ష‌పాతిగా జ‌గ‌న్ పాల‌న‌
( అమ‌రావ‌తి  - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ముఖ్య‌మంత్రి పీఠం కోసం పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ల ప‌రిపాల‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు చూశారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు చంద్ర‌బాబు 9 సంవ‌త్స‌రా లు పాలించినా.. విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రాన్ని పాలించిన తొలి ముఖ్య‌మంత్రిగా ఆయ‌న రికార్డు సృష్టించా రు. 2014-2019 మ‌ధ్య చంద్ర‌బాబు పాల‌న సాగించారు.  ఇప్పుడు మ‌రోసారిఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇక‌, 2019-2024 వ‌ర‌కు అంటే.. ప్ర‌స్తుతం వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉన్నారు.

అంటే.. రెండు కీల‌క పార్టీల త‌ర‌ఫున ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు.. కూడా.. ఐదేళ్ల చొప్పున ఈ రాష్ట్రాన్ని పాలించా రు. సో.. ఇద్ద‌రూ కూడా పాల‌న‌కు కొత్త కాదు. అనుభ‌వం లేద‌ని చెప్పే అవ‌కాశం కూడా లేదు. సో.. వీరి పాల‌న‌లో రాష్ట్రంలో ఏమేర‌కు మేలు జ‌రిగింది?  అనేది ఆస‌క్తిగా మారింది. ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌వ‌చిత ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌.. ఎవ‌రి హ‌యాంలో సాకారం అయిందనేది వెరీ ఇంట్ర‌స్టింగ్ అంశం. అదేవిధంగా ఎవ‌రు ప్ర‌జానేత‌గా గుర్తింపు పొందారు? అనేది కూడా ఆస‌క్తిక‌ర విష‌య‌మే!
చంద్ర‌బాబు:  
+ 1999-2004 మ‌ధ్య చంద్ర‌బాబు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ అనే కాన్సెప్టు తీసుకువ‌చ్చారు. కానీ, పేరుకు త‌గిన‌ట్టు  పాల‌న ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేరాలి. కానీ, పేరుకు.. ప‌నికి తేడా లేకుండా పోయింది. ప్ర‌జ‌లు ఏం కావాల‌న్నా.. ఎంఆర్‌వో కార్యాల‌యాల చుట్టూ తిరిగారు. ఎంపీడీవోల కార్యాల‌యాల చుట్టూ తిరిగారు.

+ జ‌న్మ‌భూమి క‌మిటీలు ఏర్పాటు చేశారు. త‌ద్వారా.. ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వారికి చేరువ చేయాల‌నేది ల‌క్ష్యం. కానీ, ఆచ‌ర‌ణ‌లో సాకారం కాలేదు. పైగా.. ఈ క‌మిటీల‌పై తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌తి ప‌నికీ డ‌బ్బులు వ‌సూలు చేశార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. సో.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న కాన్సెప్టు బాగానే ఉన్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం విఫ‌ల‌మైందనే చెప్పాలి. అంతేకాదు.. పార్టీపై కూడా అనేక మ‌చ్చ‌లు ప‌డే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను మ‌ళ్లీ తీసుకువ‌స్తాన‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

+ ప్ర‌జా నేత‌గా చూసుకుంటే.. చంద్ర‌బాబు ఎప్పుడూ.. కూడా ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ కాలేక పోయారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ఒక కంపెనీకి సీఈవో వ్య‌వ‌హ‌రించిన‌ట్టు వ్య‌వ‌హ‌రించా రు. పైగా.. గారు-బాబుగారు వంటి గౌర‌వ వాచ‌కాలు జోడించ‌డంతో ఆయ‌న పేద‌ల గుండెల్లోకి చేరుకోలేక పోయార‌నేది వాస్త‌వం. ఆయ‌న‌ను ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు గౌర‌విస్తారే.. త‌ప్ప‌..ఓన్ చేసుకోలేక పోయారు. చంద్ర‌న్న అనే కాన్సెప్టును తీసుకువ‌చ్చినా.. అది పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌పోయింది. ఒక మాస్ నాయకుడిగా ఆయ‌న‌ను నిల‌బెట్ట‌లేక పోయింది.

జ‌గ‌న్‌:
+ వ‌స్తూ వ‌స్తూనే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను, స‌చివాల‌యాల‌ను తీసుకువ‌చ్చారు. ఈ రెండు కూడా.. ప్ర‌జ‌ల‌కు అత్యంత వేగంగా క‌నెక్ట్ అయ్యాయి. అంతేకాదు.. ప్ర‌జల‌కు తెల్లారి లేస్తే.. వీరులేక‌పోతే ప‌నిజ‌ర‌గ‌దు! అనే స్థాయిలో వ‌లంటీర్‌, స‌చివాల‌యాల‌ను జ‌గ‌న్ చేరువ చేసేశారు. ఎంత‌గా.. అంటే.. ఇంట్లో క‌రెంటు పోయి నా.. ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఆదుకునే రేంజ్‌లో ఉంది. పింఛ‌న్ల పంపిణీ నుంచి ప‌ట్టాల వ‌ర‌కు.. ప్ర‌జ‌ల‌కు వ‌లంటీర్ల‌కు మ‌ధ్య  పేగు బంధం ఏర్ప‌డింది. దీంతో ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నీ.. ప్ర‌జ‌ల కు చేరువ అయింది. ఇక్క‌డ మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం.. ఏంటంటే.. ఒక్క రూపాయి కూడా.. అవినీతి లేక‌పోవ‌డం. పింఛ‌ను ఇచ్చినా.. ప‌థ‌కం చేరువ చేసినా.. వ‌లంటీర్లు కానీ.. స‌చివాల‌య సిబ్బంది కానీ.. ఎక్క‌డా రూపాయి లంచం తీసుకోకుండా.. ప‌నిచేయ‌డం మ‌రింత మేలు చేసింది.

+ ఆది నుంచి కూడా.. త‌న‌ను తాను జ‌గ‌న‌న్న‌`గానే ప్ర‌జ‌ల‌కు వైసీపీ అధినేత ప‌రిచ‌యం చేసుకున్నారు. త‌న ప్ర‌సంగాల్లోనూ అక్క‌చెల్లెమ్మ‌లు, అన్న‌ద‌మ్ములు అంటూ.. క‌నెక్ట్ అయ్యారు. ముఖ్యంగా మాస్‌లో జ‌గ‌న్‌కు ఫాలోయింగ్ పెరిగేలా చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. దీంతో జ‌గ‌న్ మాస్ లీడ‌ర్‌గానే కాకుండా.. గ‌తంలో త‌న తండ్రి వైఎస్ ద‌క్కించుకున్న `ప్ర‌జా నేత అనే మాట‌ను ద‌క్కించుకున్నారు. మొత్తానికి ఇద్ద‌రూ ఈ రెండు విష‌యాల్లో ఎవ‌రి పంథాలో వారు ప్ర‌యాణం చేశారు!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: