అయ్య బాబోయ్.. హాట్ హీరోయిన్ తో వేణు స్వామి లిక్కర్ పూజ?

praveen
ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఇక కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినీ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకుల జ్యోతిష్యం చెబుతూ ఎప్పుడూ వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉండేవారు. అయితే మొదట్లో వేణు స్వామి జ్యోతిష్యాన్ని పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. అయితే గతంలో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారు అని వేణు స్వామి చెప్పినప్పుడు.. ఎంతోమంది అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో వేణు స్వామి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించారు.

 ఇక తర్వాత కాలంలో వేణు స్వామి చెప్పినవన్ని ఒక్కొక్కటిగా నిజం అవుతూ వస్తుండడంతో.. ఆయన నిజంగానే నిజమైన జ్యోతిష్యం చెబుతాడు అని అందరూ నమ్ముతూ ఉన్నారు. అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాదండోయ్ ఏకంగా సినీ సెలెబ్రెటీల సైతం వేణు స్వామి భక్తులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హీరోయిన్లు సైతం వేణు స్వామి చెప్పిన విషయాలు నమ్మి పూజలు కూడా చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక దగ్గర నుంచి ఇక బుల్లితెర నటి అషు రెడ్డి వరకు వేణు స్వామి క్లైంట్లే కావడం గామనార్హం.

 ఇక ఇప్పుడు మరో డస్కి బ్యూటీ అటు వేణు స్వామి భక్తురాలిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు డింపుల్ హయాతి. మొదటినుంచి ఈమెతో వేణు స్వామి పూజలు చేయిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ఎందుకో వినూత్న రీతిలో పూజలు చేశాడు వేణు స్వామి. దీంతో ఈ పూజా విధానం కాస్త వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే పూజలో వైన్ బాటిల్స్ కనిపించడం గమనార్హం. అయితే లిక్కర్ తో పూజ జరిపించడంపై వేణు స్వామి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ఇదో రకం పూజా అని.. ఇందులో తీర్థం  మంచినీళ్లు ఉండదని అందులో లిక్కర్ కలిపే ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ లిక్కర్ తాగితే దాన్నే పూజలో పెడతాను అంటూ లిక్కర్ తాగకపోతే.. కూల్ డ్రింక్ పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: