పెద్ది: రామ్ చరణ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

Divya
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే కానుకగా థియేటర్లో విడుదల కాబోతోందనే విధంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పెద్ది షాట్ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ ఈ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అంటూ ఒక న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.


సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలిసి మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు.ఈ సినిమాని మే1 లేదా జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా ఏ విధమైనటువంటి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం 2026 సమ్మర్ హాలిడేస్ ని ఉపయోగించేలా పెద్ది సినిమాని రిలీజ్ చేయాలని ఆలోచనలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. మరో 30 రోజుల పాటు మాత్రమే ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నది.



అలాగే మరొకవైపు పెద్ది సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగానే జరుగుతున్నాయి. పెద్ది సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ పూర్తి అయినట్టుగా సమాచారం. రెండవ సింగిల్ సాంగ్ అని కూడా ఫిబ్రవరి నెలలో విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో శివరాజ్ కుమార్,జగపతిబాబు తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా రామ్ చరణ్  భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి పెద్ది రిలీజ్ డేట్ పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: