బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఆ తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది.
ఇకపోతే వివాహం తర్వాత కూడా ఈమె సినిమాల జోరును ఏ మాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం కూడా ఈమెకు వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇంతకు ముందులా కాకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో ఈ బ్యూటీ కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తన నటనతోనే ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్రను పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే. అంతటి క్రేజ్ ఉన్న ఈ నటికి అద్భుతమైన రెమ్యూనరేషన్ కూడా దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే కరీనా దాదాపుగా ఒక్కో మూవీ కి 8 నుండి 18 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ సినిమా కథ మరియు అందులో తన పాత్ర అద్భుతంగా నచ్చినట్లు అయితే ఈమె చాలా తక్కువ రెమ్యూనిరేషన్ కి కూడా సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకు కనుక తక్కువ తేదీలను ఇచ్చిన లేక దర్శకుడు , నిర్మాత లను బట్టి కూడా ఈమె తన రెమ్యూనిరేషన్ ను డిసైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని కరీనా కపూర్ ఒక్కో మూవీ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.