"సలార్ 2" షూటింగ్ స్టార్ట్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాబి సింహ..!

Pulgam Srinivas
తన నటనతో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి సింహ ఒకరు. ఇకపోతే ఈయన తమిళ సినిమాలతో మంచి గుర్తింపు ను సంపాదించుకొని ఆ తర్వాత ఇతర భాష సినిమాలలో కూడా అవకాశాలను దక్కించు కున్నాడు. అందులో భాగంగా ఈయన పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు . చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో బాబీ సింహా కు కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మొదటి భాగం లో కూడా బాబి ఓ కీలకమైన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం అందుకుంది . అలాగే ఇందులో బాబి సింహ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా "సలార్ పార్ట్ 2" షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అనే విషయాన్ని తెలియ జేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో బాగంగా బాబీ సింహా మాట్లాడుతూ ... "సలార్ 2" మూవీ షూటింగ్ ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతుంది అని ఈ నటుడు తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు . ఇక పోతే ఇప్పటికే "సలార్" మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగం పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే సలార్ రెండవ భాగం శౌర్యంగా పర్వం అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: