వరుణ్ తేజ్ వ్యూహాలలో పొరపాట్లు !

Seetha Sailaja
మెగా అభిమానులతో మెగా ప్రిన్స్ అంటూ అభిమానంగా పిలిపించుకునే యంగ్ హీరో వరుణ్ తేజ్ తన కెరియర్ లో ఇప్పుడు ఎదురీత ఈదుతున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ కి కానీసపు కలక్షన్స్ కూడ రాకపోవడంతో ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు తీవ్ర నష్టాల బాట పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో కూడ ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో ఈ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారింది అని అంటున్నారు. ఈ మూవీతో వరుణ్ తేజ్ బాలీవుడ్ లో కూడ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోవాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఈ మూవీకి వచ్చిన భయంకరమైన నెగిటివ్ టాక్ తో వరుణ్ తేజ్ కెరియర్ లో మారిచిపోవలసిన సినిమాగా మారింది.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి రావడానికి ఈ మెగా యంగ్ హీరో తన కెరియర్ పై తానే చేసుకుంటున్న ప్రయోగాల ఫలితం అని అంటున్నారు. గత సంవత్సరం విడుదలైన ‘గాండీవదారి అర్జున’ మూవీలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గా టిపికల్ పాత్రను చేసినప్పటికీ ఆపాత్రకు సగటు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అంతకు ముందు ‘గని’లో లక్ష్యం కోసం కష్టపడే బాక్సర్ గా చేసిన క్యారెక్టర్ కూడ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆ మూవీ కూడ భయంకరమైన ఫ్లాప్ గా మారింది.

ఇలా వరసపెట్టి పరాజయాలు అతడి కెరియర్ ను వెంటాడుతున్న పరిస్తుతులలో అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బతినే ఆస్కారం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘ఎఫ్2’ ‘ఎఫ్3’ ‘ఫిదా’ ‘తొలిప్రేమ’ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలు ఈ మెగా యంగ్ హీరో మార్కెట్ ను పెంచితే ప్రస్తుతం వస్తున్న వరస పరాజయాలతో ఈమెగా ప్రిన్స్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈ మెగా ప్రిన్స్ తన సినిమా ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయవలసిన పరిస్థితి ఉంది అంటూ మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: