ప్రభాస్ అద్దె ఇంటి పై సెటైర్లు !

Seetha Sailaja

టాప్ హీరోలకు అత్యంత విలాశవంతమైన ఇల్లు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ టాప్ హీరోల దృష్టి మాత్రం ఎప్పుడు విదేశాల పైనే ఉంటుంది. భాగ్యనగరంలో కంటే అవకాశం దొరికితే చాలు విదేశాలకు వెళ్ళి అక్కడ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని మన టాప్ హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా వారు ప్రవర్తించడానికి ఒక ఆశక్తికర కారణం ఉంది.

టాప్ హీరోలకు ఉన్న క్రేజ్ రీత్యా వారు అందరిలా వీకెండ్స్ లో హోటల్స్ కు షాపింగ్ లకు వెళ్ళలేరు. అందువల్ల వీకెండ్ సరదాలను ఎంజాయ్ చేయడానికి చాలామంది టాప్ హీరోలు దుబాయ్ సింగపూర్ దేశాలలో టాప్ హీరోలు విలాశవంతమైన ఇళ్ళు తీసుకుని అక్కడికి తన కుటుంబ సభ్యులతో లేదంటే వెళ్ళడం ఒక అలవాటుగా మార్చుకున్నారు.

అయితే ప్రభాస్ ఈవిషయంలో మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా లండన్ లో ఒక విలాశవంతమైన భవనంలో వీకెండ్ ను అలాగే షూటింగ్ లు లేని రోజులను ఎంజాయ్ చేయడానికి అవాకాశం దొరికితే చాలు ప్రభాస్ లండన్ వెళ్లిపోతున్నాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉంటుంది సొంత ఇల్లు కాదని అది అద్దె ఇల్లు అని అంటున్నారు. ఈ ఇల్లు అత్యంత విలాశవంతంగా ఉండటంతో ప్రభాస్ ఆ ఇంటికి నెలకు 60 లక్షల అద్దె కడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు ఏకంగా ప్రభాస్ కు పొదుపు పాఠాలు కూడ చెపుతున్నారు. నెలకు 60 లక్షలు చెల్లించుకునే బదులు సినిమాకు 50 నుండి 70 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ తనకు నచ్చిన లండన్ లో ఒక విలాశవంతమైన ఇంటిని కొనుక్కుంటే బాగుంటుంది కదా అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రభాస్ కు తెలియని పొదుపు పాఠాలు చెప్పి తాము కూడ మనీ ఎక్స్పర్ట్స్ అన్నవిషయాన్ని ప్రభాస్ దృష్టికి తీసుకురావాలాని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: