"మ్యాడ్" సీక్వెల్ షూటింగ్ అప్పటినుండి స్టార్ట్..?

Pulgam Srinivas
రామ్‌ నితిన్‌ , నార్నె నితిన్‌ , సంగీత్ శోభన్ , గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై హారిక సూర్య దేవర , సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ పోయిన సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సూపర్ పాజిటివ్  టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్  రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని పోయిన సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "మ్యాడ్ 2" మూవీ ఉండబోతుంది అని చాలా రోజుల నుండి అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే "మ్యాడ్ 2" మూవీ సీక్వెల్ కు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయినట్లు వచ్చే నెల నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ సీక్వల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో కొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: