ఈరోజు అర్ధరాత్రి నుండి "ఓటిటి" లోకి ఎంట్రీ ఇవ్వనున్న "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా ఈ నటుడి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలు లభించింది.
 

ఆ తర్వాత నుండి సుహస్ కి తెలుగు సినీ పరిశ్రమలో హీరో అవకాశాలు మరియు విలన్ అవకాశాలు ఫుల్ గా దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే హిట్ ది సెకండ్ కేస్ అనే సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: