కాబోయే భర్త 'VD' లాగా ఉండాలన్న రష్మిక
రష్మిక మందన ఢిల్లీ ఫ్యాన్స్ అనే ఎక్స్ అకౌంట్లో రష్మిక మందన్న కాబోయే భర్త ఎలా ఉండాలనే డిస్కషన్ నడిచింది. సదరు అకౌంట్లో ఫ్యాన్స్ రష్మిక కాబోయే భర్త గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పారు. అతను 'VD' లాగా ఉండాలని ఫ్యాన్స్ చెబితే ఆ పోస్టు కింద రష్మిక 'అవును నిజమే' అని రిప్లై కూడా ఇచ్చింది. ఇంతకీ 'VD' అంటే మీరు అనుకుంటున్నట్టు 'విజయ్ దేవరకొండ' కాదండోయ్! VD అంటే 'Very Daring' అని అర్ధం.." రష్మిక ఇండియాకి నేషనల్ క్రష్ కాబట్టి ఆమె కాబోయే భర్త చాలా స్పెషల్ గా అంటే 'VD' లాగా ఉండాలి. అంటే దాని అర్ధం 'వేరి డేరింగ్' గా ఉంటూ ఆమెను ప్రొటెక్ట్ చేయాలి. ఆమెను మేము క్వీన్ లాగా పిలుచుకుంటాం కాబట్టి ఆమె కాబోయే భర్త కూడా కింగ్ లాగా ఉండాలి" అంటూ ఫ్యాన్స్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి రష్మిక రిప్లై ఇస్తూ..' అవును అది నిజమే' అని రాసుకొచ్చింది
ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తనకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ అని రష్మిక ఇలా హింట్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండను ముద్దుగా 'VD' అని పిలుస్తుంటారు. అయితే ఈ పోస్టులో 'VD' అనే పదానికి ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థం వెతుకుతూ రష్మిక విజయ్ దేవరకొండతో తన రిలేషన్ ని ఇలా ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిందని.. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.