గుట్టు బయటపెట్టబోతున్న రాజమౌళి !

Seetha Sailaja
‘ఈగ’ సినిమా నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ వరకు రాజమౌళి తీసిన ప్రతి సినిమా ప్రారంభోత్సవం రోజున ఆసినిమా కథను రేఖా మాత్రంగా చెప్పడం ఒక పద్ధతిగా అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మహేష్ తో తీయబోతున్న సినిమా విషయంలో కూడ రిపీట్ కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మహేష్ తో తీయబోతున్న రాజమౌళి భారీ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథ ఫైనల్ కావడంతో ఆ మూవీ కథకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ రైటింగ్ ఇప్పుడు నడుస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఈ మూవీ కధకు సంబంధించి కొన్ని లీకులు ఇస్తున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపధ్యంలో కొనసాగే ఒక థ్రిల్లర్ కథ అంటూ ఒక లీకు వచ్చింది. దీనితో సోషల్ మీడియాలో చాలమంది రచయితలుగా మారిపోయి ఎవరి స్థాయిలో వారు ఈ మూవీ కథ పై అనేక ఊహాగానాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఊహాగానాలు అన్నింటికీ చెక్ పెట్టె సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఏప్రియల్ నెలలో రాబోతున్న ‘ఉగాది’ పండుగరోజున రాజమౌళి భాగ్యనగరంలో ఒక జాతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అదేవిధంగా కీలక నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది మారెప్పుడు విడుదల అవుతుంది అన్న విషయాల పై కూడ క్లారిటీ ఇస్తాడని అంటున్నారు.

మహేష్ కెరియర్ లో మాత్రమే కాకుండా రాజమౌళి కెరియర్ లోనే అతి పెద్ద భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ మూవీ బడ్జెట్ సుమారు 800 కోట్ల రేంజ్ లో ఉంటుందని వస్తున్న వార్తల నేపధ్యంలో రాబోతున్న ఉగాది పండుగ రోజున రాజమౌళి ఈ భారీ మూవీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడో అన్న ఆశక్తి అందరిలోను ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: