నయన్ కు 100 కోట్ల ఆఫర్..

Anilkumar
సౌత్ సినీ ఇండ్రస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. గత ఏడాది 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే షారుక్ ఖాన్ లాంటి టాప్ స్టార్ తో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా 11 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్న

ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు 7 నుంచి 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటోంది. అలాంటి నయనతార తాజాగా ఓ 100 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నయన్ ని హీరోయిన్ గా ఓ సినిమా కోసం సంప్రదించి రెమ్యూనరేషన్ గా 100 కోట్లు ఇస్తామని చెప్పారట. అయినా కూడా లేడీ సూపర్ స్టార్ అందుకు ఒప్పుకోలేదని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ 100 కోట్లు ఆఫర్ ఇచ్చిన ప్రాజెక్ట్ మరేదో కాదు.. తమిళ బిజినెస్ మ్యాన్ శరవణన్ హీరోగా నటించిన 'ది లెజెండ్' సినిమా అని ప్రచారం జరుగుతోంది. శరవణన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది.

2022 లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా హీరోయిన్గా నటించింది. అయితే మొదట ఇందులో హీరోయిన్ గా నయనతారని సంప్రదించారట. అందుకోసం 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా నయన్ దాన్ని రిజెక్ట్ చేసిందట. మరి ఇందులో వాస్తవం ఎంత అనే విషయం తెలీదు కానీ ఈ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. నయనతార కి సంబంధించి వస్తున్న ఈ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదట. అదంతా ఫేక్ అని తెలిసింది. కానీ నయన్ ఫ్యాన్స్ మాత్రం ఇదేదో నిజమే అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: