ప్రియమణి కార్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anilkumar
2022 సంవత్సరంలో విడుదలైన 'భామాకలాపం' చిత్రం ఓటీటీలో విడుదలై ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా 'భామా కలాపం 2' సినిమాను ఇటీవలే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ నేరుగా ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే సినిమాకు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటేసిందని 'ఆహా' ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన వారంలోనే 'భామాకలాపం 2' వంద మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ ని క్రాస్ చేసినట్లు 'ఆహా' తెలిపింది. 

కాగా 'భామాకలాపం 2'కి కొనసాగింపుగా 'భామాకలాపం 3' కూడా రానుందని మూవీ ఎండింగ్‌లో చూపించారు. అంతేకాదు మొదటి రెండు భాగాల్లో హౌస్ వైఫ్ గా అలరించిన ప్రియమణి పార్ట్-3 లో సీక్రెట్ రా ఏజెంట్ గా కనిపించనుంది.ప్రియమణి తాజాగా ఓ కాస్ట్లీ కార్  కొనుగోలు చేసింది. ఆమె కొన్న కారు పేరు 'మెర్సిడెజ్ బెంజ్ GLC'. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ధర సుమారు రూ.74 లక్షల వరకు ఉంది. కొత్త కారు కొన్న సంతోషంలో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కార్ షోరూమ్ లోనే కేక్ కట్ చేసింది. ఆ తర్వాత కొత్త కారుతో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను సదరు కారు సంస్థ వాళ్ళు సోషల్

 మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియమణి కొత్త కార్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే ప్రియమణికి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ ఫ్యూచర్స్ తో కలిగిన కాస్ట్లీ కార్స్ ని కొనడం ప్రియమణికి కొత్తేమి కాదు. ఇక తాజాగా ప్రియమైన గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు చేరింది. గత ఏడాది షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో కలిసి 'జవాన్' సినిమాలో కీ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీయేస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ప్రియమణి తాజాగా ఓ లగ్జరీయస్ కాస్ట్లీ కారుని కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: