నవ్విస్తూ భయపెట్టిన అంజలి

Anilkumar
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీలో మరోసారి అంజలి లీడ్ రోల్ ప్లే చేసింది. అంజలి కెరీర్ లో ఇది 50 వ చిత్రం కావడం విశేషం. ఈమెతో పాటు శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ సునీల్ సత్య షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ హారర్ అండ్ కామెడీ అంశాలతో సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక టీజర్ విషయానికొస్తే.. అంజలి క్లాసికల్ డాన్స్ చేస్తున్న షాట్ తో టీజర్ మొదలవుతుంది." ఎవర్రా వీళ్ళు.. సంగీత మహల్ వైపు వెళ్తున్నారు? ఆ మహల్ లోకి తెలిసే వెళ్తున్నారా?" అని ఓ వ్యక్తి అడగగా.." షూటింగ్ జరుగుతోందట" అంటూ బ్యాగ్రౌండ్ లో డైలాగ్స్ వినిపించాయి. 

ఆ తర్వాత డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి స్టోరీ సినిమా స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు. ఆ సమయంలో అంజలి ఓ ట్విస్ట్ చెబుతుంది. అలా టీజర్ ఒక్కసారిగా హారర్ మోడ్  లోకి వెళుతుంది. దయ్యాల గజ్జల సౌండ్ కు అందరూ భయపడతారు. దయ్యాలకు మహల్ లో ఉన్న ప్రతి ఒక్కరు వణికిపోతారు. సినిమాలో హారర్ తో పాటు కామెడీ కావలసినంత ఉంటుందని టీజర్ లోనే చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా షకలక శంకర్, సత్య ఇద్దరి కామెడీ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీజర్ చివర్లో దెయ్యంగా మారిన అంజలి విలన్ తో తలపడే షాట్ హైలైట్ గా నిలిచింది.

ఆ తర్వాత సత్య ఓ ఆడ దెయ్యంతో చేసే కామెడీ మరో హైలైట్ అనే చెప్పాలి. మొత్తంగా టీజర్ చూస్తే అంజలి గీతాంజలిగా మరోసారి భయపెట్టడం గ్యారెంటీగా కనిపిస్తోంది.ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో కంపేర్ చేస్తే... ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' భారీ బడ్జెట్ సినిమా అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్  తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు. మార్చ్ 22 న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: