సుజిత్ తో సినిమాకి రెడీ అయిన నానీ..!?

Anilkumar
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా  అతని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ అయితే ఇస్తున్నాయి. అలాగే నిన్నా మొన్నటివరకు సస్పెన్స్ లో ఉన్న ప్రాజెక్టులపై కూడా అఫీషియల్ క్లారిటీలు వచ్చేశాయి. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం.. అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా బాగానే ఆకట్టుకుంది. నాని లిస్టులో దర్శకుల లైన్ గట్టిగానే ఉంది. బలగం డైరెక్టర్ వేణుతో ఒక సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే టాక్ రాగా నేడు పుట్టినరోజు

సందర్భంగా ఆ కాంబినేషన్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. నిర్మాత శిరీష్ తో కలిసి నాని డైరెక్టర్ వేణుని కలిశారు. వారి కలయికలో వచ్చే సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ అనుకుంటున్నారు. 1980 తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతోందట. నాని సుజీత్ కాంబో మూవీ మాస్, క్లాస్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుజీత్ వరుస డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పవన్ సినిమాను పూర్తి చేసిన

తర్వాతే సుజీత్ ఈ సినిమాతో బిజీ అవుతారో లేక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాతో సుజీత్ బ్లాక్ బస్టర్ సాధిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటున్న సుజీత్ వరుస విజయాలు సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన వెలువడింది.  నాని సినిమాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడవుతుండగా సులువుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: