వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ దివి ఆసక్తికర వ్యాఖ్యలు..!!

murali krishna
బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది ఫెమస్ అయ్యారు. ప్రేక్షకులకు పెద్దగా తెలియని వాళ్ళు కూడా తమ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. అలాంటి వారిలో దివి ఒకరు.పలు ల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన దివి. మహేష్ బాబు నటించిన ,మహర్షి తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దివి బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆమెను హైదరాబాద్‌ టైమ్స్‌ 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్‌ డిజైరబుల్‌ వుమెన్‌గా ప్రకటించింది. మోడలింగ్ నుంచి ఈ చిన్నది ల్లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ తో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనదైన స్ట్రాటజీతో పాటు.. అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.ఆ వేదిక పై దివికి తన లో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చిన్న పాత్రను ఇచ్చారు. ఆతర్వాత ఈ చిన్నది పెద్దగా ల్లో కనిపించలేదు. కానీ కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లో మెరిసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ మాములుగా సందడి చేయదు. క్రేజీ ఫొటోస్ తో మతిపోగొడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తన బ్రేకప్ స్టోరీ చెప్పింది దివి.
బీటెక్ చదివే రోజుల్లోనే నేను ఒక అబ్బాయిని ప్రేమించా.. మా ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం. పెద్దలతో కూడా మా ప్రేమ విషయం చెప్పాము. వాళ్లు అంగీకరించారు. పెళ్ళికి కూడా రెడీ అయ్యాం.. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఊహించని సంఘటన జరిగింది. అతని తమ్ముడి.. అనారోగ్య కారణంగా చనిపోయాడు. అతని తమ్ముడు చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను అని తెలిపింది. తమ్ముడు చనిపోవడంతో అతను ఊర్లో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనం అవుతుందని అతను అనుకున్నాడు. నాకు ఆ విషయం చాలా రోజుల తర్వాత తెలిసింది. అప్పుడే తెలుసుంటే అతనితో వెళ్లిపోయేదాన్నేమో.. అని చెప్పుకొచ్చింది దివి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: