ప్రభాస్ కల్కి 2898 AD సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు డార్లింగ్. కానీ, అవి అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వాటిలో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే సాహో మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబట్టింది. కానీ, టాక్ పరంగా నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఇక అనంతరం వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల రిజల్ట్ ఎలా ఉందో తెలిసిందే. గతేడాది విడుదలైన సలార్ మాత్రం ప్రభాస్ అభిమానులను చాలా సంతోషపెట్టింది. ఎన్నాళ్లకు డార్లింగ్ కటౌట్‌కు తగిన సినిమా వచ్చిందని అభిమానులు పండుగ చేసుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ అందరి దృష్టి అంతా కల్కి 2898 ఏడీపైనే ఉంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ సినిమా విడుదలపై మొదట్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. ఇటీవల కల్కి మూవీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం అయ్యాయి.  తాజాగా కల్కి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.

అదేంటంటే ముందుగా అనుకున్నట్టుగానే కల్కి సినిమా హిందూ మైథాలజీకి లింకప్ ఉంటుందట. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. కల్కి 2898 AD సినిమా మహాభారతం నుండి మొదలై 2898వ సంవత్సరంలో పూర్తవుతుంది. 6000 సంవత్సరాల మధ్య జరిగే కథ ఇది. అందుకే సినిమాకు కల్కి 2898 AD టైటిల్ ఫిక్స్ చేశాము. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఎలా ఉండబోతుందో ఊహించి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాము.. అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: