సంపూని సోదరా అంటున్న యువ హీరో సంజోష్?

Chakravarthi Kalyan
వెండితెరపై రాణించాలంటే సాధారణ విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటే గానీ ఆడిషన్స్ లో మెప్పించలేరు. మంచి మంచి ఫిలిం అకాడమీల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే వెండితెరపై ఛాన్సుల కోసం అహోరాత్రులు ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ కుర్రాడు మాత్రం తనకున్న టాలెంట్ తో వెండితెరపై దూసుకుపోతున్నాడు.

ఫిలిం బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా... కేవలం సినిమాల్లో నటించాలనే ప్యాషన్ తో వెండితెరవైపు అడుగులు వేసిన ఈ యంగ్ హీరో పేరు సంజోష్.  హిమాచల్ ప్రదేశ్ లో ‘మండి స్కూల్ ఆఫ్ డ్రామా’లో వర్క్ షాప్స్ చేసి...  ఆ తరువాత అనేక వర్క్స్ షాప్స్ అటెంప్ట్ చేసిన తరువాత... వెండితెరపై హీరోగా తెరంగేట్రం చేశారు. స్కూలింగ్ అంతా వరంగల్ కంప్లీట్ చేశాడు. కాలేజీ చదువులను హైదరాబాద్ లో పూర్తి చేశాడు యువ హీరో సంజోష్. బేవర్స్ సినిమాలో ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ లాంటి విలక్షణ నటుడితో కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ తన రెండో సినిమాగా ‘సోదరా’లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సోదరా సినిమాకు సంబంధించిన రెండు పాటలు రిలీజ్‌ అయ్యాయి. అలాగే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. నిర్మాతలు త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మూవీలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో కలిసి నటిస్తున్నారు. ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఇద్దరూ తెలంగాణ ప్రాంతవాసులే కావడం విశేషం. పవన్ కల్యాణ్ నటించిన ‘అన్నవరం’ సినిమాని స్కూల్ లైఫ్ లో చూసి... సినిమాల్లోకి రావాలని ఇన్స్ ఫైర్ అయ్యానని అంటున్నాడు సంజోష్. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే. ఆల్ ది బెస్ట్ సంజోష్..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: