రామ్ చరణ్ సినిమా కోసం 'ఎన్టీఆర్ ' సినిమాటోగ్రఫర్!

Anilkumar
రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రిపేర్ చేశాడు. ఈ స్క్రిప్టు మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'RC 16' చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. మే నెలలో రెగ్యులర్ షూట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 8నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అంతేకాదు 2025 మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసే విధంగా బుచ్చిబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

రత్న వేలు ప్రస్తుతం ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర' మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి రత్న వేలు సినిమాటోగ్రఫీ మేజర్ హైలెట్ గా ఉండబోతుంది. దేవరతో ఆడియన్స్ కి సరికొత్త విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు రత్నవేలు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. 'దేవర' విజువల్లీ ఎంతో గ్రాండియర్ గా ఉండబోతుందని ఇటీవల మూవీ టీం చెబుతూ వస్తోంది. దీన్నిబట్టి సినిమాలో రత్నవేలు సినిమాటోగ్రఫీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది.
రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి రత్నవేలు(ISC) సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శనివారం ఆయన బర్త్డే కావడంతో ఈ సందర్భంగా 'RC16' టీమ్ రత్న వేలుకి ఓ పోస్టర్ ద్వారా బర్త్డే విషెస్ అందజేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. బుచ్చిబాబుతో రత్నవేలుకి మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి 'రంగస్థలం' సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా బుచ్చిబాబు వర్క్ చేయగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. 'రంగస్థలం' టైమ్ నుంచి రత్నవేలు పనితనానికి ఫిదా అయిన బుచ్చిబాబు ఇప్పుడు తాను రామ్ చరణ్ తో చేస్తున్న ప్రాజెక్టుకి సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సినిమాలకి తన సినిమాటోగ్రఫీతో ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చిన రత్నవేలు లాంటి టాలెంట్ టెక్నీషియన్ 'RC16' సినిమా కోసం పనిచేస్తున్నారనే విషయం బయటకు రావడంతో కచ్చితంగా ఈ ప్రాజెక్టు కూడా విజువల్ వండర్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు, రత్నవేలు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతంలో సరైన లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: