క్వీన్ సీక్వెల్ కి సంబంధించి అప్ డేట్ కంగనా కు ఛాన్స్ దొరికేనా..??
“సినిమా నిన్న, మొన్న రిలీజైనట్లు అనిపిస్తుంది. సీక్వెల్ గురించి ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు నన్ను. సీక్వెల్ కథ రెడీ అయిపోయింది. డబ్బు కోసం తీయాలంటే నాలుగేళ్ల కిందటే 'క్వీన్ - 2' రిలీజ్ అయ్యేది. 'క్వీన్' సినిమా రేంజ్ లోనే సీక్వెల్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు టైం తీసుకున్నాం. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది” అని చెప్పారు వికాస్ బాహ్ల్. అయితే, ఈ మూవీలో కంగనా నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో సీక్వెల్లో కూడా కంగానాకే ఛాన్స్ ఇస్తారా? లేదా వేరే హీరోయిన్కు అవకాశమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం వికాస్ ‘సైతాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ గురువారం రిలీజ్ కాగా.. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘సైతాన్’ మూవీ చేతబడి నేపథ్యంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్లో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. ‘సైతాన్’ ఒక పాపులర్ గుజరాతీ హారర్ మూవీ ‘వష్’కు రీమేక్. ‘వష్’.. గుజరాతీలో మంచి హిట్ను అందుకుంది. ఇప్పుడు అదే కథతో బాలీవుడ్లో హిట్ అందుకోవాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి 8న థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడానికి ‘సైతాన్’ వచ్చేస్తున్నాడు. కాగా.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.