ఆ సినిమాలో మెగాస్టార్ కు చిరాకు తెప్పించిన ఐరన్ లెగ్ శాస్త్రి..!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే 4 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్ లు మొత్తం భయం తో వణికిపోయేవి. ఆయన్ని కొన్ని కోట్ల సంఖ్యలో ఆరాధించే అభిమానులు ఉన్నారు.
ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాంటి చిరంజీవి ఇండస్ట్రీలో ఎప్పుడు టాప్ లెవల్లోనే ఉంటాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం ఎదురుచూసే అభిమానులకి కొదవలేదు. అంతటి మ్యాజిక్ ని క్రియేట్ చేసిన చిరంజీవి ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ వైవిద్యమైన పాత్రలను పోషించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికి చిరంజీవి నటనలో చాలా వైవిధ్యం ఉంటుంది. అలాగే ఆయన నటించేటప్పుడు చాలా ఓపికగా ఒకటికి, రెండుసార్లు చేక్ చేసుకొని మరి నటిస్తూ ఉంటాడు.ఇక ఇదిలా ఉంటే చిరంజీవి సినిమాల్లో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన ‘రౌడీ అల్లుడు ‘ సినిమా సమయంలో ఐరన్ లెగ్ శాస్త్రి నటించిన కొన్ని సీన్లు ఆయనకు చిరాకు పుట్టించాయట. ఎందుకంటే ఐరన్ లెగ్ శాస్త్రికి చిరంజీవికి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయి. అందులో చిరంజీవి తన డైలాగులను అలవోకగా చెప్పేస్తుంటే, ఐరెన్ లెగ్ శాస్త్రి మాత్రం చిరంజీవి ముందు డైలాగులు చెప్పడానికి భయపడుతూ తడబడ్డాడట. దానికి కారణం ఏంటంటే ఆ సినిమా దర్శకుడు అయిన రాఘవేంద్రరావు ఇండివిడ్యుయల్ గా ఎవరి షాట్స్ వాళ్ళవి తీసుకుంటే కామెడీ జనరేట్ అవ్వడం లేదని ఒకే షాట్ లో ఆ కామెడీ సీక్వెన్స్ మొత్తం తీయాలని ప్లాన్ చేశాడట. అందులో భాగంగా చిరంజీవి డైలాగులు చెబుతున్నాడు ఐరన్ లెగ్ శాస్త్రి కంగారులో డైలాగులను మింగేస్తున్నాడట.
దీనివల్ల చిరంజీవి అప్పటికే ఒక పది సార్లు చెప్పిన డైలాగులను చెబుతూ ఉన్నాడు. ఇక చివరికి చిరంజీవికి చిరాకు పుట్టి యాక్టింగ్ వద్దు ఏం వద్దు వదిలేద్దామా అనేంతలా ఇబ్బంది పడిపోయాడంట. మొత్తానికైతే శాస్త్రి ఫైనల్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత శాస్త్రి చిరంజీవి దగ్గరికి వెళ్ళి మీ ఎదురుగా డైలాగులు చెప్పలేకపోయాను అందుకే అన్ని టేక్ లు తీసుకున్నాను సారీ సార్ అని చెప్పాడట. దానికి చిరంజీవి సైతం పర్లేదు అన్నట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వాడట…ఇక ఇదిలా ఉంటే మరి కొన్ని సినిమాలలో కూడా కొంతమంది కొత్త ఆర్టిస్టులతో నటించేటప్పుడు చిరంజీవికి చాలాసార్లు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. అలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతిసారి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనేంత చిరాకు పుట్టేదట. నిజానికి చిరంజీవి చాలా ఓపిగ్గా ఉంటాడు.అలాంటి చిరంజీవికే అంత చిరాకు పుట్టించారంటే వాళ్ళు ఎలాంటి నటులో మనం అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: