మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఆ స్టార్స్..!?

Anilkumar
పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వ‌స్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల త‌ర్వాత చిరంజీవితో క‌లిసి ఇందులో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే.  కాగా ఈ మూవీ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత

 ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరు సెకండ్ ఇన్నింగ్స్లోనూ జోరు చూపిస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే గతేడాది వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత భోళాశంకర్తో డిజాస్టర్ను అందుకున్నారు.  అయితే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్ష్ చౌదరి, ఆషిక రంగనాథ్ లు లు కూడా భాగం అవుతున్నారని తెలుస్తుంది. ఇక వీళ్లే కాదు లేటెస్ట్ గా మరో ఇద్దరి భామల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

ప్రేమ కావాలి ఈషా చావ్లా, రన్ రాజా రన్ సురభిలు కూడా మెగా విశ్వంభరలో ఛాన్స్ అందుకున్నారని టాక్. తీసుకుంటున్నారని తెలుస్తుంది. సురభి, ఈషా చావ్లా హీరోయిన్స్ అంటే ఓకే కానీ ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ గా ఛాన్స్ లు అందుకుంటున్న ఆషిక, మీనాక్షి చౌదరిలు కూడా సిస్టర్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న  ఈ సినిమా కోసం ప్రస్తుతం చిరు రూ.40కోట్ల వరకు అందుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ కన్నా ఎక్కువగా తీసుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: