ఎంగేజింగ్ క్రైం థ్రిల్లర్.. ముఖ్యగమనిక?

Chakravarthi Kalyan
క్రైం ఇన్వెస్టిగేటివ్ కథలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన ఉంటుంది. పకడ్బందీ కథ, స్క్రీన్ ప్లే ఉంటే క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరిస్తే... బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలే.  తాజాగా వేణు మురళీధర్. వి. ఇలాంటి కథనే ‘ముఖ్య గమనిక’ పేరుతో తెరకెక్కించారు.. ఇందులో అల్లు అర్జున్ కజిన్ ... అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ ముఖ్య గమనిక మూవీని శివిన్ ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌పై రూపొందించారు. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి బజ్ తో రిలీజ్ అయింది.

కథ: విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు. దీంతో తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. అనూహ్యంగా విరాన్ తండ్రి, చాలా మంది పోలీసులు హత్యకి గురవుతుంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. అతనికి తన తండ్రి చనిపోయిన రోజే అదృశ్యమైన ఓ ఆర్.జె. కేసు కూడా ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు..
హీరో విరాన్ మంచి సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇది క్రైం థ్రిల్లర్ మూవీ కావడంతో .. ఇన్వెస్టిగేషన్ కోణంలో బాగానే చేశాడు. హీరోయిన్ లావణ్య సాహుకారకి తన పాత్రకి న్యాయం చేసింది. ఆర్.జె.గా నటించిన నటుడు, అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి ఆకట్టుకున్నారు. వీరికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది.
సాంకేతిక నిపుణుల పనితీరు..  
వేణు ముర‌ళీధ‌ర్.వి ఎంచుకున్న కథ, కథనం చాలా కాంటెంపరరీగా వున్నాయి. ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు.  క్రైం థ్రిల్లర్ కు ఎలాంటి ఎలిమెంట్స్ వుండాలో అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. దర్శకుడు మురళీధర్‌ చక్కటి క్రైం థ్రిల్లర్ తీసి సక్సెస్ అయ్యారు. రెండు భిన్నమైన క్రైం ఎలిమెంట్స్ ను... ఒకే కథలోచెప్పారు. మెప్పించారు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు.
రేటింగ్: 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: