అహనా పెళ్ళంట సినిమాలో ఆఫర్ మిస్ చేసుకున్న ఆ యాక్టర్..??
ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో కామెడీతో తన సినిమాలను రక్తి కట్టించాడు. అయితే మరి ఈ పాత్ర మొదట అనుకున్నా నటుడు మరెవరో కాదు రావు గోపాల్ రావు. ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న రామానాయుడుఈ కామెడీ పాత్ర రావు గోపాల్ రావు తో చేయించాలంటే అప్పటికే మండలాధీశుడు వంటి సినిమా చేసిన కోట శ్రీనివాసరావును చూసి జంధ్యాలకోట చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. అయితే ఓ రోజు చెన్నై ఎయిర్పోర్టులో రామానాయుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంగా అక్కడే కూర్చున్న కోట శ్రీనివాసరావుని గమనించారట. దాంతో కోటా రామానాయుడు దగ్గరికి వెళ్లి పలకరించారట. అప్పుడే తను జంధ్యాలతో చేయబోయే సినిమాను అందులో రాసుకున్న పాత్ర గురించి చెప్పారట.నేను రావు గోపాల్ రావుతో చేద్దామంటే జంధ్యాల నీతో చేద్దాం అంటున్నాడు. సరే నువ్వే చేద్దువు కానీ 20 రోజులు డేట్స్ ఇవ్వు అని చెప్పారంట. దాంతో ఆయన ఆ సినిమాకి డేట్స్ ఇవ్వడం, ఆ సినిమా పాత్ర అద్భుతంగా పండటం, కోట కామెడీ తో సినిమా విజయవంతం అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.