వెంకటేష్ నెక్స్ట్ పై వచ్చిన ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సైన్ధవ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీ నాథ్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే సైన్ధవ్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన వెంకటేష్ తనకు ఇప్పటి వరకు రెండు విజయాలను అందించినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

ఇకపోతే ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబో లో "ఎఫ్ 2" మరియు "ఎఫ్ 3" అనే రెండు సినిమాలు రూపొందాయి. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అనిల్ , వెంకటేష్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగా అనిల్ రావిపూడి , వెంకటేష్ సినిమాలో హీరోయిన్ కోసం త్రిష ను సంప్రదించినట్లు ఆమె కూడా అనిల్ చెప్పిన కథ మొత్తం విని వెంకటేష్ మూవీ లవ్ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ , అనిల్ కాంబో లో నెక్స్ట్ తెరకెక్కబోయే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతోంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు త్రిష ను సంప్రదించలేదు అని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం త్రిష , మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: