తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన కెరియర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో రెండు , మూడు సినిమాలను మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే మరి ముఖ్యంగా బోయపాటి శ్రీను , బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. మొదట విరి కాంబినేషన్ లో సింహ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వీరి కాంబో లో లెజెండ్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక కొంత కాలం క్రితమే వీరి కాంబో లో అఖండ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక వీరి కాంబో లో ఇప్పటికే మూడు విజయాలు ఉండడంతో వీరి కాంబినేషన్ లో 4 వ మూవీ పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం బోయపాటి "అఖండ 2" మూవీ కి సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
అలాగే కొన్ని రోజుల క్రితమే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక మూవీ కి బోయపాటి శ్రీను కమిట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా బోయపాటి ఒక వైపు "అఖండ 2" కథను పూర్తి చేస్తూనే మరో వైపు గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. దానితో బోయపాటి నెక్స్ట్ బాలయ్య తో "అఖండ 2" మూవీ చేస్తాడా ..? లేక గీత ఆర్ట్స్ బ్యానర్ లో వేరే హీరోతో సినిమా చేస్తాడా అనే విషయంపై అభిమానులకు క్లారిటీ లేకుండా పోయింది.