ఆమె వల్లే సుమన్ జైలు జీవితాన్ని గడిపారా..?

Divya
సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు తిరుగులేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు.. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక్కసారిగా సుమన్ జీవితాలు కొన్ని విషాదాలు సైతం కుదిపేసాయి.. దీంతో సుమన్ చాలా తీవ్రమైన ఒత్తిడి లను ఎదుర్కొన్నారు. సుమన్ ఎదుర్కొన్న కేసుల గురించి అప్పట్లో పలు రకాల వార్తలు కూడా వినిపించాయి.. సుమంత్ సన్నిహితంగా ఉండే సీనియర్ డైరెక్టర్ సాగర్ గతంలో ఒక ఇంటర్వ్యూల పలు విషయాలను తెలియజేశారు. అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయం పైన కూడా వివరించినట్టు తెలుస్తోంది.

ఏ రాష్ట్రంలో నైనా సరే ముఖ్యమంత్రి డీజీపీ చాలా పవర్ఫుల్గా ఉంటారు.. అయితే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి mgr రాష్ట్ర డిజిపి లిక్కర్ కాంట్రాక్టర్ వడమార్ ఈ ముగ్గురు వల్లే సుమన్ జైలు పాలయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవెల్లో స్కెచ్ వేసి మరి ఇరికించారని కూడా తెలిపారు. కొన్ని బెయిల్ రాణి కేసులు కూడా పెట్టించారంటూ వెల్లడించారు. అప్పట్లో సుమన్ అమ్మాయిల కలల రాకుమారుడు గా ఉండే వారిని డీజీపీ కుమార్తె సుమన్ అంటే చాలా ఇష్టం.. అయితే సుమన్ కు ఆమె పైన ఎలాంటి అభిప్రాయం లేదట.

అయితే ఆ డీజీపీ కూతురికి ఆల్రెడీ వివాహం అయిందని అయినప్పటికీ సుమన్ నీ ఇష్టపడడంతో పాటు డీజీపీ కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడ జరిగిన అక్కడికి పోలీస్ సెక్యూరిటీతో వెళ్లలేదట. అలా సుమన్ డిజిపి కూతురు వ్యవహారం ఒకసారి mgr వద్దకు వెళ్ళింది దీంతో ఎంజీఆర్ సుమన్ ను పిలిపించి.. నువ్వు నటుడివి ఎంతో భవిష్యత్తు ఉంది ఇలాంటివి చేయవద్దు అంటూ ఎంజీఆర్ హెచ్చరించారట.. అయితే ఆ విషయం చెప్పాల్సింది తనకి కాదు కానీ ఆ అమ్మాయికి అంటూ ఎంజీఆర్ తో అన్నారట సుమన్.. ఆ విషయం రాంగ్ వే లో వెళ్లడంతో డిజీపి తన బలం ఉపయోగించి సుమన్ పైన పలు రకాల అల్లరి కేసులు పెట్టించారని దీంతో చాలా కేసులు కూడా వేయించారని తెలిపారు. కానీ బ్లూ ఫిలిం కేసు మాత్రం కేవలం రూమర్సే అంటూ కొట్టేశారు. సుమన్ తల్లి గారికి గవర్నర్ బాగా తెలియడంతో వెంటనే మెయిల్ వచ్చిందని.. సుమన్ డబ్బులు ఇచ్చిన స్నేహితులందరూ కూడా మోసం చేశారని ఆ విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని తెలిపారు సాగర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: