
తారక్ 'దేవర' మూవీపై.. అప్డేట్ ఇచ్చిన జాన్వి కపూర్?
ఇకపోతే ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. దీంతో అభిమానులందరూ కూడా ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఇలాంటి సమయంలో ఇక మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావలసిన సినిమాని వాయిదా వేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన ఇక ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కాగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా దేవర రూపొందుతోంది అన్నది తెలుస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇకపోతే ఇటీవల దేవర మూవీ గురించి హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా కొన్ని పాటలు చిత్రీకరణ జరగాల్సి ఉంది అంటూ జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది. అయితే తెలుగు డైలాగులు స్క్రిప్ట్ తనకు అందిందని.. వాటిని నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ తెలిపింది. ఇక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుగు డైలాగ్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లీష్ మాట్లాడకుండా కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ జాన్వి కపూర్ తెలిపింది.